‘ఏ కథ ఎవరి చెంతకు వెళుతోందో .. ఎవరు ఊహించగలరు..’.. ఏంటి మొదళ్లలోనే వేదాంతం మొదలెట్టారు అని అనుకుంటున్నారా.. ఈ ఆర్టికల్ చదవడం ముగించినప్పుడు కూడా మీ నోటి నుంచి కూడా ఇదే పాట వస్తుంది. మన చెంతకు వచ్చిన విజయలక్ష్మిని గుర్తించకుండా పక్కకు పొమ్మని చెప్పి.. అది తెలిసిన తర్వాత బాధ వర్ణనాతీతం. అలా హిట్ సినిమా కథ మొదట తమ దగ్గర వచ్చినప్పటికీ వదులుకొని.. ఆ తర్వాత అదే కథ సూపర్ హిట్ అయి పశ్చత్తాపపడిన సందర్భాలపై ఫోకస్..
అర్జున్ రెడ్డిఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం అర్జున్ రెడ్డి . ఈ కథను మొదట డైరక్టర్ సందీప్ అల్లు అర్జున్ కి చెప్పారు. ఆ తర్వాత శర్వానంద్ కి వినిపించారు. బోల్డ్ నెస్ చూసి చేయడానికి భయపడ్డారు. తర్వాత ఈ చిత్రం విజయాన్ని చూసి శర్వానంద్ చాలా బాధపడ్డారు.
సింహాద్రిఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఈ కథను మొదట బాలకృష్ణకు వినిపించారు రచయిత విజయేంద్ర ప్రసాద్. అయితే ఈ కథను చేయడానికి బాలయ్య ఒకే చెప్పలేదు. కట్ చేస్తే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
జెంటిల్ మ్యాన్అర్జున్ ని యాక్షన్ కింగ్ గా చేసింది జెంటిల్ మ్యాన్ మూవీ. అయితే ఈ కథ మొదట డాక్టర్ రాజశేఖర్ వద్దకు వచ్చింది. అప్పుడు బిజీగా ఉండడంతో చేయలేకపోయానని రీసెంట్ గా రాజశేఖర్ గుర్తుచేసుకొని బాధపడ్డారు.
చంటిచంటి కథ మొదట తమిళంలో పెద్ద హిట్. అయితే ఆ సినిమాని తెలుగులో చేయడానికి రాజేంద్రప్రసాద్ ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ వాళ్లు మొదలెట్టేశారని రాజేంద్ర ప్రసాద్ అనేక సార్లు తన ఆవేదనను బయటపెట్టారు.
ఠాగూర్రాజశేఖర్ కి కూడా రాజేంద్ర ప్రసాద్ కి జరిగిన అనుభవం ఒకటి జరిగింది. తమిళంలో హిట్ అయిన రమణ ని తెలుగులో రీమేక్ చేయడానికి రాజశేఖర్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ చిరంజీవి ఆ కథను సొంతం చేసుకొని ఠాగూర్ గా హిట్ అందుకున్నారు.
ఇలా చేయాలను కొని మిస్ అయిన కథలు ప్రతి హీరోకి అనుభవమే. అయితే వాటిలో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని అపజయం అయ్యాయి. అతి కొన్ని సందర్భాల్లోనే రేంజ్ ని, క్రేజ్ ని పెంచాయి.