చిరు టు బన్నీ.. తమ క్రేజ్ కు మ్యాచ్ అవ్వని సినిమాలు చేసి బోల్తా పడ్డ హీరోల లిస్ట్..!

కొత్త హీరో అయినా,రెండు మూడు సినిమాల్లో నటించిన యంగ్ హీరోలైనా ఎటువంటి కథ చేసినా చెల్లుతుంది. కానీ కొంత ఇమేజ్ సంపాదించుకున్న హీరోలు ఆచి తూచి కథల్ని ఎంపిక చేసుకోవాలి. అలా కాకుండా నచ్చింది కదా అని ఏ కథని పడితే ఆ కథని ఓకే చేసి సినిమాలు చేస్తే బొక్క బోర్లా పడాల్సి వస్తుంది. ఆ హీరోల కెరీర్ కు అది ఇబ్బంది లేకపోవచ్చు కానీ.. అతని వల్ల బయ్యర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ‘హీరో అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎటువంటి పాత్ర చేసినా మెప్పించగలగాలి.తనలో ఉన్న నటుడిని శాటిస్ఫై చేసుకోవాలని ప్రయోగాత్మక కథలు చేసినా.. వాటిని తక్కువ బడ్జెట్ లో రూపొందేలా చూసుకోవాలి. అలా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కాంబినేషన్ ను నమ్మి గుడ్డిగా తమ ఇమేజ్ కు మ్యాచ్ కాని సినిమాలు చూసి కొంతమంది హీరోలు చేతులు కాల్చుకున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది హీరోలు ఉన్నారు కానీ..! అభిమానులను సైతం నిరాశపరిచిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి :

‘జై చిరంజీవ’ ‘శంకర్ దాదా జిందాబాద్’ ‘ఆచార్య’ వంటి సినిమాలు చిరు ఇమేజ్ కు ఏమాత్రం మ్యాచ్ కానివి. అయినా చేశారు. ఫలితాలు తేడా కొట్టాయి. బయ్యర్లు నష్టపోయారు. అభిమానులు చాలా నష్టపోయారు.

2) బాలకృష్ణ :

‘అల్లరి పిడుగు’ ‘పవిత్ర ప్రేమ’ ‘మహారథి’ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ‘విజయేంద్ర వర్మ’ వంటి సినిమాలు బాలయ్య ఇమేజ్ కు సెట్ అయ్యేవి కావు. అందుకే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

3) వెంకటేష్ :

వెంకటేష్ తన కెరీర్లో చేయని ప్రయోగం అంటూ లేదు. అయితే అవి ఎక్కువగా రీమేక్ సినిమాలతోనే చేశాడు. అన్నీ ఎలా ఉన్నా ‘శీను’ ‘సుభాష్ చంద్రబోస్’ ‘షాడో’ ‘చింతకాయల రవి’ వంటి సినిమాలు అతని ఇమేజ్ కు ఏమాత్రం సూట్ కానివి. అయినా చేయడంతో అవి ప్లాపులుగా మిగిలాయి.

4) నాగార్జున :

ఈయన కెరీర్ అంతా రిస్క్ లతో కూడుకున్నదే. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవి బ్లాక్ బస్టర్లు నాగార్జున రేంజ్ ను పెంచాయి. అయితే ‘కృష్ణార్జున’ ‘కేడి’ ‘బావ నచ్చాడు’ వంటి సినిమాలు అతని ఇమేజ్ కు సూట్ కానివి. అందుకే అవి ఫ్లాప్ అయ్యాయి.

5) గోపీచంద్ :

యాక్షన్ హీరోగా క్రేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్…’ఒంటరి’ ‘మొగుడు’ ‘రారాజు’ వంటి తన ఇమేజ్ కు మ్యాచ్ అవ్వని కథలు ఒప్పుకుని ప్లాప్ లు మూటగట్టుకున్నాడు.

6) పవన్ కళ్యాణ్ :

‘జాని’ ‘అజ్ఞాతవాసి’ గుడుంబా శంకర్’ వంటి చిత్రాలు పవన్ ఇమేజ్ కు సూట్ అయ్యేవి కాదు. అందుకే అవి ప్లాప్ లు అయ్యాయి.

7) ఎన్టీఆర్ :

‘ఆంధ్రావాలా’ ‘నా అల్లుడు’ ‘నరసింహుడు’ వంటి చిత్రాలు ఎన్టీఆర్ ఇమేజ్ కు సూట్ అయ్యేవి కాదు. అందుకే అవి ఫ్లాప్ అయ్యాయి.

8) అల్లు అర్జున్ :

‘వరుడు’ ‘బద్రీనాథ్’ వంటి చిత్రాలు బన్నీ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేవి కాదు. అందుకే అవి ఘోరమైన ఫలితాలను మూటగట్టుకున్నాయి.

9) రాంచరణ్ :

‘ఆరెంజ్’ ‘తుఫాన్'(జంజీర్) ‘గోవిందుడు అందరివాడేలే’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలు చరణ్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యే సినిమాలు కావు. అందుకే అవి సక్సెస్ కాలేదు.

10) మహేష్ బాబు :

‘నాని’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి సినిమాలు మహేష్ ఇమేజ్ కు అస్సలు సూట్ అవ్వలేదు. అందుకే వాటికి అలాంటి ఫలితాలు ఎదురయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus