Prasanth Neel: ప్రశాంత్‌ నీల్‌.. హీరో అవ్వొచ్చుగా అంటున్న నెటిజన్లు!

హీరోకు ప్రతి పావుగంటకు ఓసారి ఎలివేషన్‌ సీన్‌ రాస్తే ఎలా ఉంటుంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాలా ఉంటుంది అని చెప్పొచ్చు. ‘ఉగ్రమ్‌’ కానీ, ‘కేజీయఫ్‌’ రెండు సినిమాల్లో కానీ మనం ఈ అంశాన్ని అబ్జర్వ్‌ చేయొచ్చు. హీరో ఫ్యాన్స్‌ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈలలు వేసేలా ఎలివేషన్లు రాస్తుంటారు ప్రశాంత్‌. దాని వెనుక ఉన్న కారణం కూడా ఆయన ఈ మధ్య చెప్పారనుకోండి. అయితే ఇప్పుడు మరో ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. అదే ‘మీరే హీరో అవ్వొచ్చుగా ప్రశాంత్‌?’.

Click Here To Watch NOW

అవును, మీరు చదివింది నిజమే… ప్రశాంత్‌ నీల్‌ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ చర్చే నడుస్తోంది. కారణం సోషల్‌ మీడియాలో, గూగుల్‌లో కనిపిస్తున్న ఆయన ఫొటోలే. ‘కేజీయఫ్‌’ డైరక్టర్‌ కోసం వెతికి చూద్దాం అనుకుంటూ… గూగుల్‌ బాట పట్టి, సోషల్‌ మీడియా సెర్చ్‌ చేస్తున్న వారికి షాక్‌ తగిలే ఫొటోలు కనిపిస్తున్నాయి. అసలు సిసలు లవర్‌ బాయ్‌లా ప్రశాంత్‌ నీల్‌ ఫొటోలు కనిపించడమే దానికి కారణం. ‘ఉగ్రమ్‌’ సినిమా మనం తక్కువగా చూసి ఉండొచ్చు కానీ…

‘కేజీయఫ్‌’ రెండు సినిమాల్లో అతని మాస్‌ మేనరిజమ్స్‌, మాస్‌ ఆలోచనలు చూశాం. అయితే ఆయన మాత్రం చాలా కూల్‌గా క్లాస్‌గా ఉంటారు. ఇప్పుడు ఫొటోల్లో కూడా అలానే కూల్‌గా కనిపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌ ‘ప్రశాంత్‌ సర్‌… మీరు హీరో అవ్వొచ్చుగా’ అని సోషల్‌ మీడియా వేదికగా చర్చలు పెడుతున్నారు. ఇంకందరు అయితే ‘అప్పుడు మీకు మీరే మంచి ఎలివేషన్లు రాసుకోవచ్చు’ అని కూడా సజెస్ట్‌ చేస్తున్నారు. అయితే మరి ప్రశాంత్‌ మనసులో ఏముందో చూడాలి.

ఇక ‘కేజీయఫ్‌ 2’ సంగతి చూస్తే… దేశవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. చొక్కా నలగకుండా సినిమా సెంచరీల మీద సెంచరీల కొట్టేస్తోంది. ‘కేజీయఫ్‌ 3’ కూడా ఉంది అని హింట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ సినిమా వసూళ్లు ఎలా ఉండొచ్చు అని ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే లెక్కలేసేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus