Balakrishna: బాలయ్యకు ఈమె ఓకే చెబుతుందా..?

  • June 21, 2021 / 10:17 AM IST

ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్ల ఎంపిక దర్శకులకు తలనొప్పిగా మారింది. హీరోయిన్లు సైతం సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తే యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావనే భయంతో సీనియర్ హీరోల మూవీ ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం చాలామంది పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీ కోసం మెహ్రీన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మెహ్రీన్ వరుణ్ కు జోడీగా ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ మారుతి కాంబినేషన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెహ్రీన్ ఒక్కో సినిమాకు 45లక్షల నుంచి 50 లక్షల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలయ్య ఆఫర్ విషయంలో మెహ్రీన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే ఆమె నిర్ణయాన్ని వెల్లడించనున్నారని తెలుస్తోంది. బాలయ్య మూవీ విషయంలో మెహ్రీన్ ఓకే అంటారో నో అంటారో చూడాల్సి ఉంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల మెహ్రీన్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా క్రేజ్ తగ్గకముందే మెహ్రీన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది. పెళ్లికి ముందు ఎక్కువగా ఆఫర్లు రాని మెహ్రీన్ కు పెళ్లి ఫిక్స్ అయిన తరువాత భారీగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. గోపీచంద్ మలినేని ఈ మూవీ కోసం శృతిహాసన్, త్రిషలను సంప్రదించగా వాళ్లు ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus