పవర్ స్టార్ సరసన మలయాళ బ్యూటీ!

  • October 12, 2016 / 01:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది కదా.. మలయాళ బ్యూటీ ఎక్కడి నుంచి వచ్చింది ? అని అనుకుంటున్నారా..? మేము ఇప్పుడు చెప్పేది కాటమరాయుడు చిత్రం తర్వాత మూవీ గురించి. తమిళ దర్శకుడు నీశన్ తో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చేయనున్నారు.

అజిత్ హీరోగా 2015 లో వచ్చిన ‘వేదాళం’కి ఇది రీమేక్‌. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు దసరా రోజు జరిగాయి. ఇక సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఆర్టిస్టుల ఎంపిక మొదలయింది. పవన్ సరసన హీరోయిన్ గా నటించమని నయనతారను ఈ చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం సంప్రదించగా.. ఆమె ఒకే చెప్పినట్లు తాజా సమాచారం. మలయాళ బ్యూటీ పవన్ తో నటించడం ఇదే తొలి సారి. వారి జోడి కొత్తగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

కలకత్తా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కి ఓ చెల్లెలు కూడా ఉంటుంది. ఈ రోల్ కి యువ హీరోయిన్ ని సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆమె పేరుతో పాటు, ఇతర టెక్నీషియన్ల వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus