Ooha: ఆ ఒక్క కోరిక మాత్రమే మిగిలింది: ఊహ

Ad not loaded.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ ఒకప్పుడు ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఈ విధంగా కుటుంబ కథా నేపథ్యం ఉన్న సినిమాలలోను ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ శ్రీకాంత్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే శ్రీకాంత్ సహా నటి ఊహ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మొదటిసారిగా తనతో కలిసి ఆమె అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా అనంతరం ప్రేమలో పడిన ఈ జంట తిరిగి పలు సినిమాలలో నటించారు.ఇలా ప్రేమించుకొని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న తర్వాత శ్రీకాంత్ సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఊహ మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోలకు తల్లి పాత్రలో నటిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఊహ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావించారు.

వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం కేవలం పిల్లల బాధ్యత అని మాత్రమే తెలిపారు. ప్రస్తుతం తనకు తన పిల్లల బాధ్యత వారి ఎదుగుదల ముఖ్యమని అందుకే తాను ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇవ్వలేకపోయానని తెలిపారు. ఇకపై ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి కూడా లేదని ఊహ వెల్లడించారు. అయితే తనకు ఒక కోరిక మాత్రం మిగిలి ఉంది అంటూ తన కోరికను బయటపెట్టారు.

ఒకవేళ తన కొడుకు రోషన్ హీరోగా ఆయనకు తల్లి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా తన భర్త శ్రీకాంత్ తో కలిసి రోషన్ కి తల్లితండ్రుల పాత్రలో నటించాలనే కోరిక ఉందని, ఈ సందర్భంగా ఊహ తన కోరికను కూడా బయటపెట్టారు. ఇకపోతే రోషన్ ఇప్పటికే వెండితెర అరంగ్రేటం చేసి పలు సినిమాలలో నటించారు. ఇకపోతే తాజాగా రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు పొందారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus