Santosh Sobhan: యంగ్ హీరో సంతోష్ శోభన్ కి కూడా ఆ సమస్య మొదలైందా..!

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘గోల్కొండ హైస్కూల్’ తో తెరంగేట్రం చేశాడు సంతోష్ శోభన్. ఆ సినిమాలో ఓ కుర్రాడి పాత్రలో అతను కనిపిస్తాడు. అయితే 2015లో వచ్చిన ‘తను నేను’ అనే చిత్రంతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ చేశాడు. అది కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే తర్వాత వచ్చిన ‘ఏక్ మినీ కథ’ పర్వాలేదు అనిపించింది. కానీ అది ఓటీటీ సినిమా.

దీని తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మంచి రోజులు వచ్చాయి, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్.. వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. పైగా అన్నీ పెద్ద బ్యానర్లలో చేసిన సినిమాలు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య కాలంలో సంతోష్ శోభన్ (Santosh Sobhan) సినిమాల్లో హీరోయిన్ల సెలక్షన్ కూడా కామెడీగా ఉంటుంది అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు.

‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా సంగతి చూస్తే, అందులో హీరోయిన్ గా చేసిన గౌరీ జి కిషన్.. ‘జాను’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అమ్మాయి. సినిమాలో సంతోష్ పక్కన ఆమె చిన్న పిల్లలా కనిపించింది. ఇక సంతోష్ అప్ కమింగ్ మూవీలో కూడా అలేఖ్య హారిక ఎంపికైంది. ఆమె కూడా సంతోష్ పక్కన చిన్నమ్మాయిలా కనిపిస్తుంది. యూట్యూబ్ లో ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో పాటు బిగ్ బాస్ 4 లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus