బోయపాటి కావాలనే తప్పించారా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. మరో పది రోజుల్లో బాలయ్య షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్, నటి పూర్ణను హీరోయిన్లుగా ఎంపిక చేశారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి ప్రయాగ మార్టిన్ ను తప్పించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

బాలకృష్ణ సినిమాతో ప్రయాగ తెలుగు తెరకి పరిచయమవుతుందని అంతా భావించారు. అయితే ఇటీవల బాలయ్య, ప్రయాగ జోడీకి లుక్ టెస్ట్ చేసింది చిత్రబృందం. టెస్ట్ షూట్ లో అరవై ఏళ్ల బాలయ్య సరసన పాతికేళ్ల ప్రయాగ మార్టిన్ మరీ చిన్నపిల్లలా కనిపించిందట. దీంతో ప్రయాగను తప్పించి మరో హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నారట.

గతంలో ప్రగ్యా.. బోయపాటి రూపొందించిన ‘జయ జానకి నాయక’ సినిమాలో కనిపించింది. దీంతో ఇప్పుడు మరోసారి తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడట బోయపాటి. పైగా ప్రగ్యా గతంలో నాగార్జున లాంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేసింది. కాబట్టి బాలయ్య సరసన కూడా సూట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus