ప్రభాస్ కు జోడి కోసం వెతుకులాట..!!

బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. అంతర్జాతీయంగా అతనికి  గుర్తింపు లభించింది. సో తర్వాత ప్రభాస్ నటించే సినిమాలు తీసే డైరక్టర్లపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న చిత్రీకరణ అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ తో థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది. యూవీ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన అమీ జాక్సన్ ఖరారు అయింది. సుజీత్ సినిమా తర్వాత జిల్ డైరక్టర్ రాధాకృష్ణ తో డార్లింగ్ సినిమా చేయనున్నారు. విదేశాల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీలో కొత్త నటి కోసం డైరక్టర్ వెతుకుతున్నారు. అయితే  ప్రభాస్ హైట్ కి, రేంజ్ కి సరిపోయే అమ్మాయి దొరకడం కష్టంగా ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నా డార్లింగ్ కి జోడి సెట్ కావడం లేదంట. ఇందుకోసం రాధాకృష్ణ అమ్రిత్ సర్, లక్నో, చండీగఢ్ లోని ట్యాలెంట్ ఏజెన్సీ వాళ్లను సైతం సంప్రదించారని తెలిసింది. మరి ఏ ఊరి ముద్దుగుమ్మకు ప్రభాస్ తో నటించే అవకాశం వరిస్తుందో వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus