నాని, నాగ్ మల్టీ స్టారర్ మూవీలో హీరోయిన్స్ ఫిక్స్

ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కింగ్ నాగార్జున కూడా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లో నటించనున్నారు. సరికొత్త కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతోంది. తాజాగా హీరోయిన్స్ ని సెలక్ట్ చేసినట్లు తెలిసింది. నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ఎంపికయ్యారు.

యూటర్న్ సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ నాగార్జునతో కలిసి స్టెప్పులు వేయనుంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇక నాని పక్కన హాట్ బ్యూటీ మాళవిక శర్మ ఆడి పాడనుంది. వాణిజ్య ప్రకటనలతో బాగా పాపులర్ అయిన ఈమె రవితేజ, కళ్యాణ్ కృష్ణ కాంబో సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది రిలీజ్ కాకముందే నాని సరసన జోడీగా ఛాన్స్ అందుకుంది. ఈ నలుగురు వెండితెరపైన చేసే హంగామా కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus