ప్రభాస్‌ హీరోయిన్ల వెతుకులాట ముగిసేదెప్పుడు?

‘బాహుబలి’ ఇచ్చిన జోరో లేక ‘సాహో’ ఇచ్చిన స్ట్రోకో కానీ ఈ మధ్య ప్రభాస్‌ వరుస సినిమాలు ప్రకటించేస్తున్నాడు. ‘రాధే శ్యామ్‌’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే, నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రకటించారు. ఆ తర్వాత ‘ఆది పురుష్‌’ ప్రకటించేశాడు. ఆ వెంటనే ‘సలార్‌’ ముచ్చట కూడా చెప్పేశాడు. ఇప్పుడు చర్చ అంతా కొత్త సినిమాల మీద నుంచి ఆ సినిమాల్లో హీరోయిన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. ప్రభాస్‌ కొత్త సినిమాల్లో నాయికల లెక్క, చర్చ, ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగ్‌ అశ్విన్ సినిమా హీరోయిన్‌ మాత్రమే ఇప్పటివరకు పక్కా అయ్యింది. మిగిలిన రెండు సినిమాల లెక్క ఇంకా తేలలేదు.

టాలీవుడ్‌లో కొత్త సినిమా మొదలవుతుందన్నా, ప్రకటించినా హీరోయిన్ల చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ఆ చర్చ ప్రభాస్‌ సినిమాల విషయంలో ఎక్కువైంది. ప్రస్తుతం ప్రభాస్‌ డైరీలో నాలుగు సినిమాలున్నాయి. ‘రాధే శ్యామ్‌’ ఆఖరికి వచ్చేసింది కాబట్టి.. అందులో హీరోయిన్‌ ఎవరో కూడా మనకు తెలుసు. ఇక నాగ్‌ అశ్విన్‌ సినిమాకు దీపిక పదుకొణె హీరోయిన్‌ అని ప్రకటించేశారు కాబట్టి ఆ సినిమాను పక్కన పెట్టేద్దాం. ఇక మిగిలింది ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’. ఈ రెండు సినిమాలకు కలిపి మొత్తం ముగ్గురు హీరోయిన్లు కావాలి. ‘ఆది పురుష్‌’ సీత పాత్ర కోసం చాలా పేర్లు వినిపించాయి. కియారా అడ్వాణీ, కృతి సనన్‌.. ఇంకా చాలా పేర్లు వచ్చాయి. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు.

ఈలోగా ‘సలార్‌’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా హీరోయిన్ల లెక్క మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్‌ ఉందట. అందులో ఓ నాయికగా దిశా పటాని చేస్తోందని వార్తలొస్తున్నాయి. రెండో నాయిక విషయంలో చర్చలు జరుగుతున్నాయట. దానికి సౌత్‌ నుంచి ఓ నాయికను ఎంపిక చేస్తారనే వార్తలొచ్చాయి. మరి చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఏం చేస్తాడో చూడాలి. అయినా స్టార్‌ హీరోయిన్‌ సినిమా అంటే ఈ హీరోయిన్ల చర్చ ఏంటో…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus