Chiranjeevi: జగదేక వీరుడు రెడీ… మరి అతిలోక సుందరి ఎక్కడ? భలే చిక్కొచ్చిందే?

సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలు మొదలవుతున్నాయంటే ఓ సమస్య మొదలవుతుంది. అదే హీరోయిన్ల సమస్య. కథ రెడీ, డైరక్టర్‌ రెడీ, హీరో కూడా రెడీ… కానీ హీరోయిన్‌ ఇంకా రెడీ అవ్వదు. ఇది ఏ ఒక్క హీరోకో పరిమితం కాదు. దాదాపు సీనియర్‌ స్టార్‌ హీరోలందరికీ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ డిస్కషన్‌ ఎందుకు అని అంటే… చిరంజీవి కొత్త సినిమా పనులు పట్టాలెక్కబోతున్నాయి కాబట్టి. చిరు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ రేపో ఎల్లుండో అని టాక్‌ వినిపిస్తోంది. అయితే హీరోయిన్‌ ఇంకా ఓకే అవ్వలేదు.

‘భోళా శంకర్’ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఏంటి అంటే.. క్లారిటీ అయితే లేదు కానీ.. చిన్నపాటి లీక్‌లు, క్లూలు అయితే ఉన్నాయి. అందులో తొలి సినిమా ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట మల్లిడిది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఈ సినిమా చిరు ఐకానిక్ సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కాన్సెప్ట్‌లో ఉంటుంది అని అంటున్నారు. దీని కోసం ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.

అయితే ఆ వీరుడి కోసం అతిలోక సుందరులు ఇంకా దొరకలేదట. అదేంటి సుందరులు… ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా అని అడుగుదాం అనుకుంటున్నారా? ఆగండాగండి ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు కాదు మొత్తంగా ఎనిమిది హీరోయిన్లు కావాలట. ఎందుకంటే ఈ సినిమాలో చిరు సరసన అష్ట నాయిక కాన్సెప్ట్‌ రన్‌ చేయబోతున్నారు. దీని కోసం హీరోయిన్ల వేట జరుగుతోంది. ఒకరిద్దరు అగ్ర శ్రేణి నాయికలను, మిగిలిన వాళ్లను కొత్త అందాలను తీసుకోవాలని అనుకుంటున్నారట.

దీంతో సమస్య వచ్చిందట. ఇంతమంది హీరోయిన్లు, అందులోనూ ఇద్దరు సీనియర్‌ హీరోయిన్లు ఓకే చేయాలంటే కష్టమే. దీని కోసం సీనియర్‌ హీరోల పక్కన నప్పే భామల వేటను టీమ్‌ కొనసాగిస్తోందట. తెలుగులో సీనియర్‌ నాయికలు అయి ప్రస్తుతం సినిమాలు చేస్తున్నవాళ్లు.. సౌత్‌లో మిగిలిన పరిశ్రమల హీరోయిన్లవైపు ఈ వెతుకులాట జరుగుతోందట.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus