హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారలు

  • January 30, 2017 / 02:27 PM IST

పువ్వుపుట్టగానే పరిమిళిస్తుంది.. అన్నట్టుగా కొంతమంది చిన్నప్పుడే అత్యంత ప్రతిభను కనబరుస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగుతున్న తారలు బాల్యంలోనే చక్కగా నటించి అభినందనలు అందుకున్నారు. స్కూల్ కి వెళ్లే వయసులోనే కెమెరా ముందు నిలబడి అభినయాన్ని పలికించారు. అటువంటి నటీమణుల గురించి ఫోకస్ ..

నిత్యా మీనన్“అలా మొదలయింది” చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ నిత్యామీనన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడే ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో నటించింది. పదేళ్ల వయసప్పుడే అనుభవం ఉన్న నటిలా నటించి ప్రశంసలు అందుకుంది.

హన్సికదేశముదురు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన హన్సిక చిన్నప్పుడే స్టార్ హీరోతో సినిమా చేసింది. “హమ్ కౌన్ హై” అనే హిందీ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి బాలనటిగా హన్సిక మెప్పించింది. అనేక హిందీ సీరియల్స్ లోను నటించి అభిమానులను సొంతం చేసుకుంది.

శ్రావ్యసందడే సందడి.. ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి శ్రావ్య మంచి మార్కులు కొట్టేసింది. లవ్ యూ బంగారం మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, గత ఏడాది వచ్చిన నందిని నర్సింగ్ హోమ్ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది.

కీర్తి సురేష్నేను శైలజ చిత్రంలో అందరి హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత. తల్లి మేనక నటి. 80 వ దశకంలో బిజీ హీరోయిన్. మలయాళం, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తల్లి నుంచి నటనను వారసత్వంగా అందుకొని కీర్తి బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. 2000 సంవత్సరంలో వచ్చిన పైలెట్స్ మూవీలో కీర్తి నటనతో అభినందనలు అందుకుంది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా మరో రెండు చిత్రాల్లో కనిపించింది.

శ్రీ దివ్యజగపతిబాబు, అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాని జాగ్రత్తగా చూస్తే ఓ చిన్నారి ముద్దుముద్దుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో కాదు “మనసారా” సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్యనే. చిన్నప్పుడే భయం లేకుండా కెమెరా ముందు పర్ ఫార్మెన్స్ ఇచ్చి.. నేడు బిజీ తారగా ఎదిగింది.

మంజిమ మోహన్సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జంటగా నటించిన మలయాళ బ్యూటీ బాల నటిగా ఎనిమిది సినిమాలు చేసింది. 1998 నుంచే మలయాళ సినిమాల్లో నటిస్తోంది. “మధురనంబరకట్టు” అనే మూవీలో నటనకు గానే కేరళ స్టేట్ నుంచి మంజిమ మోహన్ ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.

శ్రియ శర్మజై చిరంజీవ.. చిత్రంలో చిరంజీవి మేనకోడలుగా చిన్నారి శ్రియ శర్మ ముద్దుగా ఆకట్టుకుంది. దూకుడు చిత్రంలోనూ సమంతకు చెల్లెలిగా నటించి శెభాష్ అనిపించుకుంది. 2015 లో రిలీజ్ అయిన గాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అంకితసింహాద్రి సినిమాలో “చీమ చీమ” పాటతో బాగా ఫేమస్ అయిన నటి అంకిత. ఈమె హీరోయిన్ గా లాహిరి లాహిరి చిత్రం ద్వారా అడుగుపెట్టినా.. చిన్నప్పుడే రస్నా వాణిజ్య ప్రకటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.

షాలినిజగదేక వీరుడు అతిలోక సుందరి, బ్రహ్మ పుత్రుడు తో పాటు షాలిని దక్షిణాది భాషల్లో బాలనటిగా 40 సినిమాలు చేసింది. తెలుగులో హీరోయిన్ గా కనిపించినప్పటికీ మళయాలం, తమిళ భాషల్లో కథానాయికగా 10 చిత్రాల్లో నటించి అలరించింది.

షామిలిషాలినికి చెల్లెలు అయిన షామిలి అక్కతో కలిసి చిన్నప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కనిపించింది. రాజు.. రాజు.. అంటూ ఆకట్టుకుంది. అంజలి చిత్రంలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఓయ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా అడుగు పెట్టి అభినయంతో అందరినీ కట్టిపడేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus