‘సరిలేరు నీకెవ్వరు’ థర్డ్ సింగిల్ కూడా సూపర్..!

ప్రామిస్ చేసినట్టు గానే ప్రతీ సోమవారం ఒక్కో సింగిల్ ను విడుదల చేస్తూ వస్తున్నారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టీం. ఇప్పటీకే విడుదల చేసిన రెండు లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఈ వారం కూడా ‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ థర్డ్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని మధు ప్రియా పాడింది. మహేష్ బాబు గ్లామర్ ను ఎలోబరేట్ చేస్తూ ఈ పాట రాసినట్టు ఉన్నాడు లిరిసిస్ట్ శ్రీమణి. మధ్య మధ్యలో కూడా ‘హి ఈజ్ సో క్యూట్’ అనే లైన్ ను క్యారీ చేస్తూ వచ్చారు. చిన్న పిల్లలకు కూడా ఈ పాట నచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఈ పాటకి దేవి ఇచ్చిన ట్యూన్ కూడా బాగుంది. మహేష్ అభిమానులకు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కు ఈ పాట వెంటనే నచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు. మిగిలిన ప్రేక్షకుల్ని కూడా ఈ పాట ఆకట్టుకునే విధంగానే ఉంది. ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఆడియో ఈ చిత్రానికి దేవి సమకూర్చడంలో సక్సెస్ సాదిస్తున్నట్టే కనిపిస్తుంది. మిగిలిన రెండు పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటే.. ఆల్బం మొత్తం హిట్ అయినట్టే అని చెప్పాలి. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus