Shouryuv: నానితో గొడవ.. క్లారిటీ ఇచ్చిన ‘హాయ్ నాన్న’ దర్శకుడు!

  • December 3, 2023 / 11:53 AM IST

నాని డైరెక్టర్స్ ని చాలా బాగా గౌరవిస్తూ ఉంటాడు అని చాలా మంది చెబుతూ ఉంటారు. అతని కెరీర్లో దాదాపు 10 మంది దర్శకులను(నిర్మాతగా కూడా కలుపుకుని) ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అందులో చాలా మంది ఈరోజు టాప్ పొజిషన్లో నిలబడ్డారు. వాళ్ళు నాని పై ఎప్పుడూ ఏ కంప్లైంట్ చేయలేదు. మొన్నామధ్య ఎప్పుడో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆ సినిమా సీక్వెల్ విషయంలో చిన్నపాటి కోల్డ్ వార్ నడిచింది అనే గాసిప్స్ వినిపించాయి కానీ..

దాని గురించి జనాలు పెద్దగా పట్టించుకుంది అంటూ ఏమీ లేదు. అయితే ఈ మధ్య ‘హాయ్ నాన్న’ దర్శకుడితో నానికి గొడవ నడిచింది అంటూ చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ‘పుట్టింది అంటే.. పాకొచ్చేస్తుంది కూడా’ అనే బ్యాచ్ ఎక్కువే కాబట్టి.. దీనిపై డిస్కషన్స్ కొంచెం ఎక్కువగా జరిగాయి. అయితే ఇందులో నిజం లేదని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యవ్ చెప్పుకొచ్చాడు. ‘ఈ సినిమా విషయంలో నాని గారు ఇన్పుట్స్ ఇచ్చిన మాట నిజం.

అవి బెటర్ చేయడానికి ఇంకా బాగా కలిసొచ్చాయి. ఓ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో చేస్తున్నప్పుడు.. కొంచెం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ రకంగా నాని గారు నన్ను కరెక్ట్ చేసే ప్రాసెస్ లో కొంచెం గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయేమో కానీ, గొడవలు వంటివి ఏమీ జరగలేదు. నన్ను ఎక్కువగా నమ్మింది ఆయనే(నాని)’ అంటూ చెప్పుకొచ్చాడు (Shouryuv) శౌర్యవ్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus