ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.
కానీ వర్షాల వల్ల.. సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.కానీ స్టడీగా వీకెండ్ వరకు కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం కూడా ఒకింత పర్వాలేదు అనిపించింది అనే చెప్పాలి.6 వ రోజు అయిన మంగళవారం నాడు కూడా ఓకె ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.77 cr |
సీడెడ్ | 0.38 cr |
ఉత్తరాంధ్ర | 0.19 cr |
ఈస్ట్ | 0.14 cr |
వెస్ట్ | 0.10 cr |
గుంటూరు | 0.11 cr |
కృష్ణా | 0.10 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.85 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.87 cr (షేర్) |
‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.2.13 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.87 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓ పక్కన ‘బేబీ’ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల ‘హిడింబ’ ఎక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది.
కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ల బ్రో వస్తుంది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు తక్కువగా ఉన్నాయి.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!