ప్రభాస్.. భూకబ్జాదారుడన్న మాటను.. అబ్జెక్ట్ చేసిన హైకోర్టు..!

హైదరాబాద్ లోని, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిసర ప్రాంతంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను తాజాగా రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు కూడా. అయితే పలు వాయిదాలు, విచారణలు జరిగిన తరువాత… ఇప్పుడు మరోసారి ఈ భూవివాదం కేసు పై హైకోర్టులో వాద ప్రతి వాదనలు జరిగాయి.

ఈ వాదనలలో ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభాస్ కు అనుకూలంగా తీర్పునిస్తే కబ్జాదారులను ఎంకరేజ్ చేయడమే అవుతుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ప్రభాస్ తరఫు లాయర్ వివరణ ఇచ్చాడు. వీరిరువురి వాదనలు విన్న తరువాత న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేయడం గమనార్హం.ప్రభాస్ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యల పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. మరి ఈ ఫైనల్ గా ఈ కేసు ప్రభాస్ గెలుస్తాడో.. లేదో అనే దాని పై ప్రస్తుతం ఫిలింనగర్లోనూ… అలాగే సోషల్ మీడియాలోనూ చర్చలు మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus