‘కాంతార’ చిత్రం విజయవంతంగా రెండు వారాలు పూర్తిచేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. కన్నడంలో రిలీజ్ అయ్యి అయితే నెల రోజులు కావస్తోంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. దీపావళికి కొత్త సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా.. అన్నీ కూడా ‘కాంతార’ ముందు తేలిపోయాయి. ఓ కన్నడ సినిమా ఈ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపించడం అంటే చిన్న విషయం కాదు.
హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి కూడా సైలెంట్ గా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలైన ‘హోంబలే ఫిలింస్’ వారు నిర్మించారు. ఈ చిత్రం కొనుగోలు చేసిన ప్రతి బయ్యర్ భారీ లాభాలను ఆర్జించడం జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం ‘కాంతార’ కి పెద్ద షాక్ తగిలింది.వివరాల్లోకి వెళితే.. ఈ మూవీలో ‘వరాహ రూప’ అనే పాట ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పాట ట్యూన్ ని మలయాళంలోని ఓ ఆల్బమ్ సాంగ్ నుండి లేపేశారు అంటూ మ్యూజిక్ బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జి కోర్టుకెక్కింది. వారి పిటిషన్ ను పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు ‘కాంతార’ మేకర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సాంగ్ ను అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల నుండి నిషేధించడం జరిగింది. ‘కాంతార’ చిత్రానికి బి.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
ఇక ‘కాంతార’ చిత్రం నవంబర్ 4 నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది అంటూ వార్తలు రాగా.. వాటిని నిర్మాతలు ఖండించారు. ఇప్పట్లో ‘కాంతార’ ఓటీటీలో రిలీజ్ అవ్వదు అంటూ వారు తెలియజేశారు. మరోపక్క నవంబర్ రెండో వారం లేదా చివరి వారం నుండి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!