‘ఓజి’ (They Call Him OG) సినిమా విషయంలో నిర్మాత డీవీవీ దానయ్యకి మరోసారి షాక్ తగిలింది. ‘ఓజి’ సినిమా ప్రీమియర్స్ అలాగే నార్మల్ డేస్ లో టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన (జీవో) మెమోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ‘ఓజి’ నిర్మాత దానయ్య తరఫు లాయర్ రివ్యూ కోరగా దానిని కూడా హైకోర్టు తిరస్కరించింది. ముందుగా ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
అలాగే అక్టోబర్ 9 కి విచారణని వాయిదా వేసింది. అక్టోబర్ 9 వరకు ఓజి టికెట్ హైక్స్ కి అనుమతి లేదని స్పష్టం చేసినట్టు అయ్యింది. అయినప్పటికీ ముందుగా పెంచిన రేట్లే.. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ‘ఓజి’ రిలీజ్ కి ముందు టికెట్ రేట్ల పెంపు కోసం టీం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు మేకర్స్. అందుకు హోమ్ శాఖ ఆమోదం తెలుపుతూ జీవో పాస్ చేయడం జరిగింది. దీంతో ‘ఓజి’ సినిమాకి టికెట్ రేట్లు భారీగా పెంచారు.
అయితే దీనిని సవాలు చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. టికెట్ రేట్లు పెంపు విషయంలో హోమ్ శాఖకు సంబంధం ఏంటి? వారి ప్రమేయం ఎందుకు? అంటూ అతను పిటిషన్లో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. హోంశాఖ, స్పెషల్ సీఎస్ కి ఇలాంటి విషయాల్లో సంబంధాలు ఉండవని అతను పేర్కొన్నాడు. అయితే కోర్టు అతని ఫిర్యాదుని స్వీకరించి సానుకూలంగా స్పందించినా.. టికెట్ రేట్ల విషయంలో ఎటువంటి మార్పులు జరగలేదు. చూడాలి మరి తదుపరి విచారణ ఏమవుతుందో..!