నడిగర్ ఎన్నికలు.. తెలుగు రాష్టాల్లో జరిగిన ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి మొన్నటి వరకూ..! అయితే ఈ నెల జూన్ 23న జరగాల్సిన తమిళ నడిఘర్ సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు వెల్లడించింది. ఇందుకు ముఖ్యకారణం ఏంటంటే.. ‘మొదట ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజ్ లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అక్కడ నిర్వహిస్తే.. ట్రాఫిక్ సమస్యల వల్ల జనం ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన కోర్టు ఎన్నికల వెన్యూ మార్చాలని సూచించిందట.
ఈ కారణంతో ఎన్నికలను వాయిదా వేసారట.ఇప్పటీకే విశాల్ ప్యానెల్, భాగ్యరాజ్ ప్యానెల్ సభ్యులు ఒకరినొకరు దూషించుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ తెలుగు వ్యక్తి కాదని.. నడిగర్ సంఘంలో ఉండడానికి వీల్లేదని అతడిని నడిగర్ సంఘం నుండి బయటకి పంపేయాలని ఇటీవల భాగ్యరాజ్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఇక విశాల్ కి స్నేహితురాలైన వరలక్ష్మీ కూడా విశాల్ పై ఫైరయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.