మహేష్ ప్రతిష్టాత్మక సినిమాపై భారీ ఊహాగానాలు

మనం కొన్ని నెంబర్లకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తాం. వంద, యాభై సంఖ్యలకు ఉన్న మాదిరిగానే పాతికకు ఓ విలువ ఉంది. ఈ నంబర్ ని మహేష్ చేరుకోబోతున్నారు. తన కెరీర్ లో ఈ మెయిలు రాయిగా నిలిచిపోనున్న సినిమాకి మహేష్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఊపిరి సినిమాతో కొత్త కథలతో విజయాన్ని అందుకోవచ్చనే దైర్యానిచ్చిన వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఎంచుకున్నారు. అతను మహేష్ ను కొత్త కథలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లో సాగనుంది. ఎక్కువగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనుంది. గతంలో “వంశీ”, “నేనొక్కడినే” సినిమాలు విదేశాల్లోనే ఎక్కువభాగం చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఈ రెండు ఫెయిల్ అయ్యాయి.

అయినా కథ మీద నమ్మకంతోనే అమెరికాలో షూట్ చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ లొకేషన్ కి తగ్గట్టు మహేష్ ని చాలా స్టైలిష్ గా చూపించడానికి వంశీ సిద్ధమవుతున్నారు. అల్లరి నరేష్ కీలకరోల్ పోషించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో కలలు కంటున్నారు. ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కొన్ని సీన్లు, ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి మూవీ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus