ఎన్టీఆర్ అభిమానులతో విజిల్స్ వేయించే సన్నివేశం అదేనంట !

మాటల మాంత్రికుడితో ఎన్టీఆర్ సినిమా అనగానే ఉమ్మడి కుటుంబం, అందులోని అనుబంధాలు.. మనసు కదిలించే మాటలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఆగష్టు 15 న రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథకి ఎటువంటి యాక్షన్ అవసరమో, ఆ హీరోకి ఎటువంటి ఆవేశం ఉండాలో అవన్నీ అరవింద సమేత వీర రాఘవలో ఉన్నాయని అర్ధమయిపోయింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు.. టీజర్ లోను ఆ లుక్ కనిపించింది. శత్రువులను తరుముకుంటూ కనిపించారు. ఆ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.

ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం 15 నిముషాలు ఉంటుందంట. అందులో ఎన్టీఆర్ యాక్షన్ కి ప్రతి ఒక్కరూ విజిల్స్ వేస్తారని చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఏమైతే కోరుకుంటుంటారో అంతకు మించి ఈ ఫైట్ ఉంటుందని తెలిపింది. డీజీ బ్యూటీ పూజా హెగ్డే, హైదరాబాద్ బ్యూటీ ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. థమన్ పాటలను కంపోజ్ చేయడాన్ని కంప్లీట్ చేశారు. నేపథ్య సంగీతం సమకూర్చే పనిలో పడ్డారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus