విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం పర్వాలేదు అనిపించింది కానీ.. ఆనంద్ ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అతని రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వారు రూ.4.5 కోట్లకు ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసారు. ‘అంతపెద్ద మొత్తం ఈ చిన్న హీరో సినిమాకి ఎందుకు పెట్టారా?’ అని అంతా అనుకున్నారు.
కానీ కంటెంట్ పరంగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం అందరినీ ఆకర్షించింది. ఈ వీకెండ్ పూర్తయ్యేలోపు ఈ చిత్రానికి మంచి వ్యూయర్ షిప్ వచ్చి అమెజాన్ వారు లాభాల బాట పట్టే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గల కారణం సహజత్వంతో కూడుకున్న టేకింగ్ అనే తెలుస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో డబ్బుకోసం పడే కష్టాలు..వ్యాపారాల్లో వచ్చే నష్టాలు, సెటిల్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం వంటి అంశాలను..
రియాలిటీకి చాలా దగ్గరగా చూపించారు. ముఖ్యంగా హీరో ఫాథర్ క్యారెక్టర్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. పిల్లల పై ప్రేమ ఉన్నప్పటికీ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తండ్రులు.. దానిని ఎందుకు బయటపెట్టరు అనే విషయాన్ని ఈ పాత్ర ద్వారా చాలా చక్కగా చెప్పారు. దర్శకుడు వినోద్ ఈ చిత్రంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతుండడం విశేషం.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!