తమన్ కు మరో మెగా ఆఫర్ : రాశీని వద్దంటున్న గోపీచంద్ : రవితేజ ‘ఖిలాడి’ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రం రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మరియు ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నాడు తమన్.

గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశీఖన్నాను ఎంపిక చేసుకోవాలని మారుతి భావించాడట. ఇదే విషయాన్ని హీరో గోపీచంద్ కు చెప్పగా… అందుకు గోపి నో చెప్పినట్టు టాక్. రాశీఖన్నాతో గతంలో ‘జిల్’ ‘ఆక్సిజన్’ వంటి సినిమాలు చేసాడు గోపి. కానీ ఆ రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అందుకే గోపి.. ఇలా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది.

‘క్రాక్’‌ చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ తన తరువాతి చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్షన్లో చెయ్యబోతున్నాడు.’ఖిలాడి’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆల్రెడీ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అయితే జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజున రవితేజ అభిమానులకు గిఫ్ట్ గా ‘ఖిలాడి’ చిత్రం నుండీ ఓ గ్లింప్స్ ను విడుదల చెయ్యాలని చిత్ర దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus