మరోసారి చిట్టి బాబుతో జిగేలు రాణి : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అంటున్న అశ్విన్‌ : దిల్‌రాజ్‌- సూర్య-బోయపాటి రెడీ అంట

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా 45నిమిషాల నిడివిగల సిద్ద అనే పాత్ర పోషించనున్నాడు. కాగా ఈ చిత్రంలో ఇతనికి జోడీగా పూజా హెగ్డే ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.మొదట రష్మిక, కియారా అద్వానీ వంటి వారిని సంప్రదించినప్పటికీ.. ఫైనల్ గా పూజా హెగ్డే ను ఫిక్స్ చేశారట. గతంలో ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్- పూజ లు జిగేలు రాణి పాటకు చిందేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో ఓ సైన్స్ ఫిక్షన్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుండీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి అప్డేట్‌ రాలేదు.దాంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కదు అంటూ ప్రచారం జరిగింది. అయితే జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో హిట్టు కొట్టి తిరిగి ఫామ్లోకి వచ్చిన సూర్య.. ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.ఇదే క్రమంలో ఓ స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాడు.టాలీవుడ్ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చెయ్యడానికి సూర్య రెడీ అవుతున్నాడట. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్‌ రాజు ఈ క్రేజీ ప్రాజెక్టుని నిర్మించబోతున్నట్టు సమాచారం.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus