‘ఆచార్య’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ : బాలీవుడ్ కు ‘క్రాక్’ : ఇక పవన్ తోనే ‘జన గణ మన’

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ టీజర్‌ అప్డేట్ వచ్చేసింది. జనవరి 29 న సాయంత్రం 4:05 నిమిషాలకు ధర్మస్థలి డోర్ ఓపెన్ అంటూ దర్శకుడు కొరటాల శివ తన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోతో ప్రకటించాడు. మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్ కూడా‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు కాగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. అది కూడా 50శాతం సీటింగ్ ఆకుపెన్సీతోనే అంటే ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్ వంటి స్టార్లలో ఒకరు ఈ రీమేక్లో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఎప్పటినుండో తన డ్రీం ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ ను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. తొలుత మహేష్ బాబుతో ఈ ప్రాజెక్టు చెయ్యాలి అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. దాంతో ఈ ప్రాజెక్టుని ఎప్పటినుండో పక్కన పెడుతూ వచ్చాడు పూరి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ ప్రాజెక్టు చేయబోతున్నాడట పూరి. ఈ మధ్యనే పవన్ నుండీ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus