ధృవలో ఆకర్షించే ఐదు అంశాలు

  • December 7, 2016 / 01:24 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్రూస్లీ తర్వాత చేసిన చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి బృందం దాదాపు ఏడాది పాటు శ్రమించి తెరకెక్కించిన ఈ మూవీ రెండు రోజు(డిసెంబర్ 9 )ల్లో విడుదల కానుంది. మెగా ఫ్యామిలీకి రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఈ డైరక్టర్ ధృవ రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ఆకర్షించే ఐదు అంశాలపై ఫోకస్..

కథతెలుగులో ఎప్పుడూ రామ్ చరణ్ రీమేక్ జోలికి వెళ్లలేదు. ఫ్రెష్ కథలతోనే సినిమాలు చేశారు. తొలి సారి చెర్రీని ఈ బాట పట్టించింది తమిళ చిత్రం “తని ఒరువన్”. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా కథ చరణ్ కి బాగా నచ్చింది. చిత్రాన్ని చూసిన వెంటనే ఒకే చెప్పారు. పూర్తిగా మైండ్ గేమ్ తో సాగే ఈ స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీ, సరి కొత్త సీన్లను జోడించి సురేందర్ రెడ్డి అద్భుతంగా రూపొందించారు.

హీరోకథ కోరితే ఎంత కష్టానికైనా వెనుకాడని నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ఐపీఎస్ ఆఫీసర్ లుక్ కోసం ఆరు నెలలు కస్టపడి సిక్స్ ప్యాక్ బాడీని చెర్రీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు తన నటనతో, ఫైట్లతో స్టోరీకి మరింత బలాన్నిచ్చారు.

హీరోయిన్ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చెర్రీతో కలిసి బ్రూస్లీలో నటించింది. ఈ సినిమా విజయం సాధించక పోయినా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది. అందుకే ఇందులోనూ చరణ్ తో ఆడి పాడింది. ధృవలో రకుల్ గ్లామర్ డోస్ పెంచినట్లు “పరేశానురా” పాట టీజర్ చూస్తుంటే అందరికీ అర్ధమవుతోంది. టీజర్ లో ఆమెను చూసిన వారందరూ ఆ అందాలను వెండితెరపై చూసేందుకు తహతహలాడుతున్నారు.

విలన్రోజా, ముంబయి సినిమా ల ద్వారా తమిళ నటుడు అరవింద్ స్వామి తెలుగు వారికీ పరిచయం. ఆయన డైరక్ట్ గా తెలుగు చిత్రం ఇప్పటివరకు చేయలేదు. ధృవ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే హీరోగా కాకుండా విలన్ గా నటన ప్రతిభను మరోసారి నిరూపించుకోనున్నారు.

నిర్మాణ సంస్థగీతాఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ధృవ ని నిర్మించారు. ఈ బ్యానర్లో రామ్ చరణ్ ఇది వరకు మగధీర చేశారు. అది ఇండస్ట్రీ హిట్ అయింది. ఇన్నేళ్లకు మళ్లీ వీరికలయికలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus