అనుపమకు ఎదురైన వింత అనుభవం!

సినీ తారలకు అభిమానులతో రకరకాల అనుభవాలు ఉంటాయి. వారు చేసే పనులకు కొన్నిసార్లు ఆనందంతో స్టార్స్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. మరికొన్నిసార్లు కోపంతో కళ్ళు ఎరుపెక్కుతాయి. అయితే ఈ రెండు కాకుండా అనుపమకు వింత అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి హిజ్రాలు పోటీపడడంతో ఏమిచేయాలో తెలియక సిగ్గుతో తలదించుకుంది. కేరళ బ్యూటీ అనుపమ తెలుగులో అ..ఆ మూవీ ద్వారా అడుగుపెట్టింది. ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో హిట్ అందుకుంది. అచ్చమైన తెలుగుఅమ్మాయిగా పేరు తెచ్చుకోవడంతో మరిన్ని ఆఫర్లు ఆమె చేతికి వచ్చాయి.

అయితే ఉన్నదీ ఒక్కటే జిందగీ, తేజ్ ఐలవ్యూ  సినిమాలు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేకపోయాయి. హిట్ ట్రాక్ లోకి రావాలని “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు(శనివారం) హైదరాబాద్, కూకట్‌పల్లిలోని సుచిత్ర సర్కిల్‌లో వీఆర్‌కే సిల్క్స్‌‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఆమెను చూసేందుకు జనాలు వేలాదిగా తరలివచ్చారు. వారిని పోలీసులు కంట్రోల్ చేశారు. అయితే షో రూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన హిజ్రాలను ఆపలేకపోయారు. దీంతో వారు అనుపమతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus