తెలుగు సంప్రదాయమంటే నందమూరి బాలకృష్ణకు చాలా ఇష్టం. ఏ వేదికెక్కినా బాలయ్య తెలుగు పద్యాలను పాడి మన భాష గొప్పదనాన్ని చాటుతుంటారు. రీసెంట్ గా మన కళాకారులైన పిట్టల దొరలను గుర్తుచేశారు. వారిలాగా మాట్లాడి ఆ కళను గుర్తించిన కళాకారుడిగా నిరూపించారు. తన అమ్మ బసవతారం స్వగ్రామానికి వెళ్లిన బాలకృష్ణ ఆప్తులు కోరిక మేరకు పిట్టలదొరలాగా మాట్లాడి ఆకట్టుకున్నారు. “మాకు ఏమి తక్కువయిందని మీ దగ్గరకు వచ్చామండి.. ఏడంతస్తుల మేడ.. ఏడు దున్నలు పాడి, వీపు మీద విస్తరి, పిర్రల మీద పీట, బాగా భోజనం చేసేవాళ్ళమే నండీ, అంతెందుకు గుమ్మడికాయంత బంగారం..
కుక్క వాసన చూసిందనీ, దిబ్బలో పడేస్తే మైలు పడతాయని, ముగ్గురు కూలీలను పెట్టి, మూడు దమ్మిడీల కూలీ ఇచ్చి, తీసుకెళ్లి ఊరవతల కోనేటిలో పడేయిచ్చాను, పక్కింటిఆవిడ దానిని తెచ్చుకొని కళ్ళకి అడ్డ దిడ్డాలు, నడుముకి నానా తిప్పలు, చెంపకు చేరాలు, నెత్తికి మూకుడి చిప్ప చేయించు కుందంట. అలాగే మాకు నీళ్లకు ఏమి తిప్పలు లేదు. ఇంట్లో పంపు, వీధిలో పంపు, పొయ్యిలో పంపు, అన్నీ ఉన్నా, పొయ్యి మీదకు వంట రాకపోవడంతో మీ దగ్గరకు వచ్చామండీ” అంటూ పిట్టల దొరలు ఊర్లలోని ఆసాములు, మునిసీబులు ఇంటి ముందు కెళ్లి మాట్లాడేవారని బాలయ్య చెప్పారు. ఆయన మాట్లాడినంత సేపు నవ్వులు పువ్వులు విరిశాయి. అయితే ఆ కళాకారులు ఈ మధ్య కనిపించడం లేదని బాధపడ్డారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.