రొమాన్స్ ఎక్కువవుతుంది కార్తికేయ

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిప్పీ’. కార్తికేయ సరసన దిగాంగన హీరోయిన్ గా నటిస్తుండగా.. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. టీఎన్ కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ల వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను నింపేశారు.

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అయితే బోల్డ్ గా ఉంటుందో ఈ చిత్రంలో కూడా హీరోది అదే తరహా క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ లో ఎక్కువ రొమాన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఓవర్ ఆల్ గా ఈ ట్రైలర్ ఓకే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటూ తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగుతో పాటూ తమిళంలో కూడా మార్కెట్ ఏర్పరుచుకోవాలని కార్తికేయ భావిస్తున్నట్టున్నాడు. ఇక ఈ చిత్ర ట్రైలర్ ను మీరు కూడా ఒకసారి చూసెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags