Sita Ramam, Bimbisara: ‘సీతా రామం’ ‘బింబిసార’ చిత్రాల సక్సెస్ పై చిరు ట్వీట్ వైరల్..!

జూలై నెలలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ సాధించలేదు. దీంతో టాలీవుడ్ కు గడ్డుకాలం అని అంతా బాధపడ్డారు. నిర్మాతలు కూడా దీనికి సరైన కారణం తెలీక షూటింగ్ లు బంద్ చేయడం, ఓటీటీల పై పడటం మనం చూస్తూనే ఉన్నాం.ఇలాంటి నేపథ్యంలో నిన్న (ఆగస్టు 5న) విడుదలైన ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్ కు రావడం పై అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆయన తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. “ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతా రామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు , సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం చిరు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు మంచి ఓపెనింగ్స్ ను సాధించాయి. మరోపక్క చిరంజీవి ఈ ఏడాది ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దసరాకి ‘గాడ్ ఫాదర్’ గా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అంతేకాకుండా 2023 జనవరి సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అంతేకాదు 2023 సమ్మర్ కు ‘భోళా శంకర్’ అనే చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులను ఎంజాయ్ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus