HIT2 Tickets: అఖండ సెంటిమెంట్ ను హిట్2 రిపీట్ చేస్తుందా?

అడివి శేష్ హీరోగా నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్2 సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తున్న అడివి శేష్ హిట్2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హిట్2 సినిమాతో అడివి శేష్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ట్విస్ట్ మేజర్ హైలెట్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు బుకింగ్స్ కూడా పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. ఏ సెంటర్లలో హిట్2 మూవీ హవా ఉండే ఛాన్స్ అయితే ఉంది. గతేడాది డిసెంబర్ నెల 2వ తేదీన అఖండ మూవీ థియేటర్లలో విడుదలై అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఏఎంబీ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్ లలో హిట్2 సినిమాకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి.

తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అఖండలా డిసెంబర్ 2వ తేదీన విడుదలవుతున్న హిట్2 సినిమా కూడా సక్సెస్ సాధించి ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. అడివి శేష్ ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అడివి శేష్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కే సినిమాలకు ఓటేస్తుండటం అడివి శేష్ కు ప్లస్ అవుతోంది. ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ రేంజ్ లో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus