Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్లో ‘హిట్ 3′(హిట్ : ది థర్డ్ కేస్) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మే 1న సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘ఎ’ సినిమా అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను సాధించింది.

Hit 3 Collections

అయితే తర్వాత వర్షాలు, ఐపీఎల్ మ్యాచ్..ల ప్రభావం వల్ల కలెక్షన్స్ తగ్గాయి. అయినప్పటికీ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తర్వాత డీసెంట్ షేర్స్ తో నెట్టుకుంటూ వచ్చి రన్ ను ముగించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 17.78 cr
సీడెడ్ 4.75 cr
ఉత్తరాంధ్ర 5.15 cr
ఈస్ట్ 2.98 cr
వెస్ట్ 2.06 cr
గుంటూరు 2.79 cr
కృష్ణా 2.59 cr
నెల్లూరు 1.28 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 39.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.98 cr
మిగిలిన భాషలు 1.64 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 60.25 cr

‘హిట్ 3′(Hit 3) సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.60.25 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.112 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.11.25 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

‘ఆరంభిద్దామా’.. ఎట్టకేలకు తలైవాకి డైరక్టర్‌ ఫిక్స్‌… ఎవరంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus