‘వీరసింహారెడ్డి’ టు ‘సామజవరగమన’.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాల లిస్ట్..!

  • July 4, 2023 / 12:54 PM IST

జూన్ నెల ముగిసింది. అంటే ఈ ఏడాది సగం ముగిసినట్టే. ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ ‘ఆదిపురుష్’ వంటి మూడు పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ సక్సెస్ రేట్ బాగానే నమోదైనట్టు స్పష్టమవుతుంది. మరి 6 నెలల్లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) వీర సింహారెడ్డి :

బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో.. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం రూ.68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.75.41 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.7.41 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ గా నిలిచింది. .

2) వాల్తేరు వీరయ్య :

చిరంజీవి – బాబీ కాంబినేషన్లో.. .సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిన ఈ చిత్రం రూ.87 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.130.29 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.43.29 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) వారసుడు :

విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో.. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం రూ.14.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.14.99 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.0.79 కోట్ల లాభాలను అందించి సక్సెస్ అందుకుంది.

4) పఠాన్ :

షారుఖ్ ఖాన్ – సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ అయ్యింది. రూ.4.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.8.56 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇక్కడి బయ్యర్స్ కు రూ.4.31 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

5) రైటర్ పద్మభూషణ్ :

సుహాస్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. రూ.1.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.3.89 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్స్ కు రూ.2.14 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

6) సార్ :

ధనుష్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యింది.తెలుగు రాష్ట్రాల్లో రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.21.21 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్స్ కి రూ.15.71 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.61.4 కోట్ల షేర్ ను సాధించి.. రూ.27.4 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) వినరో భాగ్యము విష్ణు కథ :

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యింది. రూ.4.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.5 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.50 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.

8) బలగం :

వేణు ఎల్దిండి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ అయ్యింది. రూ.1.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.12.01 కోట్ల షేర్ ను సాధించింది. మొత్తంగా నిర్మాతలకి రూ.10.81 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

9) ‘దాస్ క ధమ్కీ’ :

విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ మార్చి 22న రిలీజ్ అయ్యింది. రూ.7.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.10.32 కోట్ల షేర్ ను సాధించి రూ.2.42 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

10) దసరా :

నాని హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 30న రిలీజ్ అయ్యింది. రూ.47.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.62.6 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.15.1 కోట్ల లాభాలతో సూపర్ హిట్ గా నిలిచింది.

11) విరూపాక్ష :

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ ఏప్రిల్ 21 న రిలీజ్ అయ్యింది. రూ.22.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఫుల్ రన్ ముగిసేసరికి ..రూ.47.52 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కు రూ.24.72 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.

12) బిచ్చగాడు 2 :

విజయ్ ఆంటోని నటించిన ఈ మూవీ రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.9.27 కోట్లు షేర్ ను రాబట్టి… రూ.3.42 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది.

13) 2018 :

ఈ మలయాళ సినిమా రూ.1.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.2.8 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసి… రూ.1.1 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

14) ‘మేమ్ ఫేమస్’ :

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ ముగిసేసరికి రూ.2.02 కోట్ల షేర్ ను రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది.

15) స్పై :

నిఖిల్ నటించిన ఈ మూవీ రూ.16.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రెండు రోజుల్లోనే రూ.8.13 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆదివారం కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

16) సామజవరగమన :

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీ రూ.4.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. రెండు రోజుల్లోనే రూ.2.01 కోట్ల షేర్ ను రాబట్టింది. శని, ఆదివారాల కలెక్షన్లతో ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus