Hanu Man: హనుమంతుడి స్ఫూర్తితో హాలీవుడ్ మూవీ… దర్శకుడు మనకు తెలిసినోడే!

తెలుగు సినిమానే కాదు, మొత్తంగా ఇండియన్‌ సినిమానే ఇప్పుడు ‘హను – మాన్‌’ గురించి మాట్లాడుతోంది. ఆ మాటకొస్తే విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలో తెలుగు వాళ్లు ‘హనుమాన్‌’ నామస్మరణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఆలోచనతో హాలీవుడ్‌లో ఓ సినిమా సిద్ధమైంది. అయితే హనుమంతుడి కథను యాజ ఇట్‌ ఈజ్‌ చెప్పడం లేదు కానీ… ఆ కాన్సెప్ట్‌తోనే రూపొందించారు. ఆ సినిమానే ‘మంకీ మ్యాన్‌’.

మోడరన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ‘మంకీ మ్యాన్‌’ను తెరకెక్కించింది కూడా ఎవరో కాదు మనకు బాగా పరిచయం ఉన్న దేవ్‌ పటేలే. 2008లో వచ్చిన ఆస్కార్ పురస్కార విజేత ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆ కుర్రాడే దేవ్ పటేల్. ఆ సినిమా తర్వాత కొన్ని వైవిధ్యమైన పాత్రలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు దేవ్‌ పటేల్‌. అలా పదికిపైగా ఆంగ్ల చిత్రాల్లో నటించాడు.

‘లయన్’, ‘ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ’, ‘హోటల్ ముంబై’, ‘ది గ్రీన్ నైట్’ లాంటి సినిమాలతో మెప్పించాడు దేవ్‌. ఇప్పుడు ఆయనే ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. యునివర్శల్ పిక్చర్స్ నిర్మించిన ‘మంకీ మ్యాన్’ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో కాన్సెప్ట్‌, విజువల్స్‌ చూసి నెటిజన్లు వ్యూస్‌ వర్షం కురిపిస్తోంది. ట్రైలర్‌ ప్రకారం చూస్తే కథంతా ఇండియాలోనే జరుగుతుంది.

మాఫియా మీద ఓ వ్యక్తి ఎలా తిరగబడ్డాడనే పాయింట్ మీద సినిమా రూపొందింది. అయితే ఆ హీరో పాత్ర హనుమంతుడి ఆధారంగా తీర్చిదిద్దారు. హీరో ఆలోచనలు అలానే ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శోభిత ధూళిపాళ నటిస్తోంది. ఆమెతోపాటు విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే లాంటి బాలీవుడ్ నటులు చాలా మందే ఉన్నారు. ఇక ‘మంకీ మ్యాన్’ ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus