Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 7, 2026 / 09:26 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నవీన్ చంద్ర (Hero)
  • దివ్య పిళ్లై (Heroine)
  • దివి, రాజా రవీంద్ర, జయని తదితరులు (Cast)
  • కరుణ కుమార్ (Director)
  • రవి పీట్ల - ప్రవీణ్ కుమార్ రెడ్డి (Producer)
  • అజయ్ అరసాడ (Music)
  • నగేష్ బన్నెల్ (Cinematography)
  • మార్తాండ్ కె.వెంకటేష్ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 06, 2026
  • ఓవా ఎంటర్టైన్మెంట్స్ (Banner)

దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం “హనీ”. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రలు పోషించిన ఈ డార్క్ థ్రిల్లర్ ప్రమోషనల్ కంటెంట్ ఒకరకమైన మూడ్ క్రియేట్ చేసింది. తెలుగులో ఈ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదు అని ఎంతో నమ్మకంతో చెప్పాడు కరుణ కుమార్. మరి అది నిజమేనా? ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!

Honey Movie Review

Honey Movie Review and Rating

కథ: ఈజీ మనీ కోసం చీకటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు ఆనంద్ (నవీన్ చంద్ర). ఉద్యోగం పోయాక “పిల్లి మాయ” కోసం వెతుకులాట మొదలుపెడతాడు. సారంగపాణి (రాజా రవీంద్ర) సహాయంతో వెతుకులాట వేగం పుంజుకుంటుంది.

కట్ చేస్తే.. ఆనంద్ కూతురు మీరా (జయని) వల్ల మాత్రమే పిల్లి మాయని పొందడం సాధ్యపడుతుంది అని గ్రహిస్తారు.

Honey Movie Review and Rating

నటీనటుల పనితీరు: నవీన్ చంద్ర లుక్ నుండి మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ విషయాల్లో కొత్తదనం చూపించాడు. ఒక అత్యాశపరుడు, మనసు నిండా చీకటి నింపుకున్న ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా నవీన్ నటన చాలా సహజంగా ఉంటుంది. కాసేపటికి నవీన్ కనబడడు, కేవలం ఆనంద్ మాత్రమే కనిపిస్తాడు. అతడు కర్కశత్వం ప్రదర్శించిన తీరు కచ్చితంగా ఇబ్బందిపెడుతుంది.

దివ్య పిళ్లై కెరీర్ బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఒక తల్లిగా మాత్రమే కాక, ఒక వ్యక్తిగా ఆమె తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన తీరు షాక్ కి గురి చేయడమే కాక నటిగా ఆమె పొటెన్షియల్ ని పరిచయం చేసింది. ఇకనైనా ఆమెను బియాండ్ బోల్డ్ & గ్లామర్ గా చూస్తే బాగుంటుంది.

దివి పాత్ర చిన్నదే, డైలాగులు కూడా తక్కువే. అయితే స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం బాగుంది. రాజా రవీంద్ర చాలా సిన్సియర్ గా కనిపించాడు.

Honey Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించిన షార్ప్ నెస్, మరీ ముఖ్యంగా క్వాలిటీ DI సినిమాలో కనిపించలేదు. దానికి కారణం ఏంటో కరుణకుమార్ కే తెలియాలి.

అయితే.. నగేష్ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, అజయ్ అరసాడ నేపథ్య సంగీతం కానీ సినిమా యొక్క మూడ్ ని చాలా నిర్దిష్టంగా మైంటైన్ చేశాయి.

దర్శకుడిగా కరుణ కుమార్ తాను ఎంచుకున్న జోనర్ కి స్టిక్ అయ్యి ఉన్నాడు. ఎక్కడా చిన్నపాటి డీవియేషన్ కూడా లేదు. అలాగే.. ఆడియన్స్ డిస్టర్బ్ అవుతారా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్న కథని చాలా సిన్సియర్ గా, స్ట్రిక్ట్ గా, వైల్డ్ గా చెప్పాడు.

ఒకానొక సందర్భంలో “ఇది మనం చూడలేం” అనిపించకమానదు. ముఖ్యంగా చిన్న పాపతో పిల్లి తాలుకు మాయ చేతులతో ఎత్తించే సన్నివేశం ఆల్మోస్ట్ వాంతింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వ్యూయర్స్ కి సినిమా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అనేందుకు ఇవి ఉదాహరణలు. అలాగే.. సినిమాకి ఇచ్చిన ముగింపు ఎక్కడా కమర్షియాలిటీ కోసం హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తారేమో అనుకొనేలోపు చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. దర్శకుడిగా కరుణ కుమార్ విజన్ ని ఎంత క్లియర్ గా ప్రెజెంట్ చేశాడు అనేది ప్రతి ఫ్రేములో కనిపిస్తూనే ఉంటుంది.

Honey Movie Review and Rating

విశ్లేషణ: మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలు పేపర్ లేదా న్యూస్ ఛానల్ లో కనిపిస్తే తప్ప మనకి తెలియవు. ఒక వ్యక్తి ఇంతలా దిగజారతాడా? అది కూడా డబ్బు కోసం, ఒక్కోసారి డబ్బు కంటే పవర్ కోసం ఇంత నీచానికి ఒడిగడతాడా? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.

మనిషిలోని ఆ చీకటి కోణాన్ని చాలా రా & రస్టిక్ గా ప్రెజంట్ చేస్తుంది “హనీ”. డార్క్ గా మాత్రమే కాదు డిస్ట్రబింగ్ గా ఉంటుంది సినిమా. నవీన్, దివ్యల నటన, కరుణ కుమార్ టేకింగ్, అజయ్ అరసాడ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ వాచ్ గా నిలిపింది.

Honey Movie Review and Rating

ఫోకస్ పాయింట్: మనిషిలోని చీకటి కోణానికి దర్పణం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Honey Movie

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version