బాలీవుడ్ చిత్రంతో తలపడుతున్న మరో హాలీవుడ్ చిత్రం..!

ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు బాలీవుడ్ చిత్ర కలెక్షన్లను దెబ్బ తీస్తున్నాయి. ఇటీవలే విడుదలైన జంగిల్ బుక్ చిత్ర విషయంలో ఇదే రుజువైంది. తాజాగా మరో హాలీవుడ్ చిత్రం.. బాలీవుడ్ చిత్ర కలెక్షన్లను దెబ్బ తీయడానికి సిద్దమౌతోంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘హౌస్ ఫుల్ 3’ చిత్రం జూన్ 3 న విడుదల అవుతుండగా.. అదే రోజున హాలీవుడ్ చిత్రం ‘టీనేజ్ మ్యూటాంట్ నింజా టార్టల్స్:ఔట్ ఆఫ్ ది షాడోస్’ చిత్రం విడుదల అవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 10 న విడుదల అవ్వాల్సి ఉండగా..

ఒకవారం ముందుగానే ఈ చిత్రం విడుదల అవుతోంది. కాగా గతంలో షారూఖ్ నటించిన ‘ఫ్యాన్’ తో పోటీపడటం ఇష్టం లేక జంగిల్ బుక్ చిత్రాన్ని ఒకవారం ముందుగానే విడుదల చేశారు. అలాగే సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పయో’ చిత్ర విడుదల కంటే ముందుగా జేమ్స్ బాండ్ ‘స్పెక్టర్’, ‘దిల్ వాలే’, బాజీరావ్ మస్తానీ చిత్రంతో తలపడకూడదన్న ఉద్దేశ్యంతో ‘స్టార్ వార్స్’ చిత్రాన్ని ఒకవారం ముందుగానే విడుదల చేశారు. జంగిల్ బుక్ కలెక్షన్లు దృష్టిలో పెట్టుకొనే ఈ హాలీవుడ్ చిత్రాన్ని ఒకవారం ముందుగా విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus