Mahesh babu, Jr NTR: ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలిచాడో తెలుసా?

ఎవరు మీలో కోటీశ్వరులు అనే గేమ్ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా తానేంటో నిరూపించుకున్న తారకరాముడు ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కుటుంబం తో కలిసి చూసేలా ఎవరు మీలో కోటీశ్వరుడు షోను మొదలుపెట్టాడు. ఇక మధ్యమధ్యలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీలను కూడా గేమ్ ఆడించడం హైలెట్ గా నిలుస్తోంది. రామ్ చరణ్ తో మొదలైన సెలబ్రిటీ లో ఆట మహేష్ బాబుతో ముగియనుంది.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేశాడు. ఇక మహేష్ బాబు తో చేసిన ఎపిసోడ్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు ఎంత గెలుచుకున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ మొత్తంగా 25 లక్షల వరకు గెలుచుకున్న ట్లు సమాచారం. ఇక ఆ డబ్బును మహేష్ బాబు తనకు ఇష్టమైన చారిటీకి అందించినట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు కు ఒక మంచి అనుబంధం ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తారక్ మహేష్ అన్నా అంటూ ప్రత్యేకంగా సంభోదించడం అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus