టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో నిన్నటి తరం సెన్సేషన్ శ్రీకాంత్, ఊహ. ఆ జంట వివాహ బంధంతో ఒకటై నేటికి (20/01/21)కి 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అసలు శ్రీకాంత్, ఊహ ఎప్పుడు, ఎలా కలిశారు, వారి వివాహం ఎలా జరిగిందో ఓసారి రీక్యాప్ వేద్దామా. ఆ మధ్య ఓ షోకి వచ్చిన శ్రీకాంత్ – ఊహ తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు… అవే ఇవి!
‘ఆమె’ షూటింగ్ సమయంలో శ్రీకాంత్ – ఊహకు పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లకు ఆ స్నేహం ప్రణయానికి దారి తీసింది. ఆ తర్వాత వివాహబంధంలో అడుగుపెట్టారు. ముందుగా చెప్పినట్లు వారిద్దరికి పెళ్లి అయ్యి 24 ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు రోషన్ త్వరలో ‘పెళ్ళి సందD’తో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
“ఆమె’ కోసం మేమిద్దరం తొలిసారి కలిశాం. ఆ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీకి కావడంతో ఎవరైనా పాపులర్ హీరోయిన్ను ఎంపిక చేస్తారేమో అనుకున్నా. కానీ ఊహ సెట్లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన వెంటనే.. ‘ఈమేంటి ఇంత లావుగా ఉంది’ అనుకున్నా. ఆ తర్వాత మేం మొత్తం నాలుగు సినిమాలు చేశాం. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఊహతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పిలిచేవాణ్ని. అలా ఆమెను మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేశా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!