Hrithik Roshan, Ram Charan: మరో పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌కి గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతోందా?

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ చాలా ఏళ్లుగా చెబుతున్న సినిమా గుర్తుందా? అదేనండీ ఆయన కలల ప్రాజెక్ట్‌. కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తు. అదే అండర్‌ వాటర్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమా. అప్పుడెప్పుడో షారుఖ్‌ ఖాన్‌ ఓ ప్రధాన పాత్రధారుడిగా ఆ సినిమా ఉంటుంది అని చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్లీ ఆ సినిమా పుకారు ఇప్పుడు బయటికొచ్చింది. ఈసారి ఆ సినిమాలోని ఇద్దరు ప్రధాన పాత్రధారుల పేర్లు బయటికొచ్చాయి.

శంకర్‌ చేద్దాం అనుకుంటున్న అండర్ వాటర్‌ సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. ఒకప్పుడు భారతీయ సినిమా, అందులోనూ భారీ బడ్జెట్‌ సినిమా అంటే బాలీవుడ్‌ నటులే గుర్తొచ్చేవారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటూ దక్షిణాది సినిమా దూసుకొచ్చింది. దీంతో టాలీవుడ్‌ – బాలీవుడ్‌ కాంబో ఈ సినిమా చేయాలని శంకర్‌ అనుకుంటున్నారట. అలా బాలీవుడ్‌ నుండి గ్రీక్‌గాడ్ హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ నుండి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను తీసుకోవాలని చూస్తున్నారట.

అయితే ఇక్కడ వచ్చిన ఏకైక సమస్య సినిమా బడ్జెట్‌. అవును శంకర్‌ అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే సినిమాకు సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చవుతుంది అంటున్నారు. అంత బడ్జెట్‌తో సినిమా రూపొందించాలంటే ఒక నిర్మాత వల్ల సాధ్యమయ్యేలా లేదు. ఒక్కో ఇండస్ట్రీ ఒక్కో నిర్మాత వచ్చి సినిమాఓ తలో చేయి వెయ్యాలి. హీరోలు కూడా భాగస్వాములు అవుతారు. ఇక కాస్టింగ్‌ లాంటివి కూడా భారీగానే ఉంటాయి. అయితే పాన్‌ ఇండియా ఫీవర్‌ ఉన్న ఈ సమయంలోనే ఈ సినిమా స్టార్ట్‌ అవ్వాలి.

ఈ పుకారు నిజమైతే… దేశ సినిమా చరిత్రలోనే ఇదే భారీ చిత్రం అవుతుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం శంకర్‌, రామ్‌చరణ్‌ సినిమా షూటింగ్‌ అవుతోంది. దీని తర్వాత శంకర్‌ ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ‘ఇండియన్‌ 2’ చేస్తారు అంటున్నారు కమల్‌ హాసన్‌. ఆ లెక్కన ‘ఇండియన్‌ 2’ తర్వాత ఈ సినిమా ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో?

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus