బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు హృతిక్ రోషన్ ఒకరు. ఈయన ఎంతోమంది అమ్మాయిల అభిమాన హీరో అని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఎన్నో సినిమాలలో యాక్షన్ సన్నీ వేషాలలో డూప్ లేకుండా నటించి పెద్ద ఎత్తున సాహసాలు చేశారని చెప్పాలి. ఇలా హృతిక్ రోషన్ ఒక సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా తాను చనిపోతానని అనుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా హృతిక్ రోషన్ తన ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ తాను వార్ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టపడ్డానని తెలిపారు. నా జీవితంలోనే నేను అత్యంత కష్టపడిన సినిమా వార్. ఈ సినిమా కోసం శారీరకంగా తనని తాను ఎంతో కష్ట పేట్టుకున్నానని,ఇలా శారీరకంగా బాగా కష్టపడటంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని హృతిక్ రోషన్ తెలిపారు.
ఈ డిప్రెషన్ కారణంగా నేను అసలు బ్రతుకుతానా లేక చనిపోతానా అన్న భావన తనలో కలిగిందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హృతిక్ రోషన్ తెలియజేశారు. ఈ సినిమాలో తాను నటించిన పాత్రకు అనుగుణంగా నా శరీరం లేకపోవడంతో తనను తాను మలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. అయితే 2019వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుందని ఈ సినిమాలో తన కష్టానికి సరైన ఫలితం లభించిందని చెప్పాలి.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?