మహేష్ 25 వ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానెల్

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా మహర్షి. రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో కాలేజ్ స్టూడెంట్ “మహర్షి” గా కొత్త లుక్ తో మహేష్ బాబు అదరగొట్టారు. ఇందులో అల్లరి నరేష్ మహేష్(మహర్షి) కి స్నేహితుడిగా కనిపించబోతున్నారు. అలాగే జయసుధ, ప్రకాష్ రాజ్ లు మహేష్ కి తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కెరీర్ లో నిలిపోయే విధంగా వంశీ తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే డెహ్రా డూన్ లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం.. త్వరలోనే అమెరికాకి వెళ్లనుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకముందే మహర్షి మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ ఛానల్స్ పోటీపడ్డాయి. జెమిని వారు అత్యధిక ధర చెల్లించి ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై నమ్మకంతో భారీ మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. భరత్ అనే నేను మూవీ తర్వాత మహేష్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus