బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అతను నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలకు వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ వచ్చాయని, దాంతో అతనికేదో హిందీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని భావించి…తెలుగులో ఏమి పీకలేకపోయినా.. హిందీలో డెబ్యూ ఇచ్చేస్తున్నాడు. ‘సరే ఒక చోట రాజు.. ఇంకోచోట భటుడు’ అన్నట్టు.. ఇక్కడ క్లిక్ అవ్వకపోయినా నార్త్ లో అయినా క్లిక్ అయ్యి టాప్ హీరో అయితే మనకే మంచి పేరు వస్తుంది కదా.
కాబట్టి అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ హిందీ డెబ్యూకి మంచి సినిమా సెలక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యంగా. సౌత్ సినిమాలు అంటే పడిచస్తున్నారు కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా హిందీలో రీమేక్ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ అతను ‘ఛత్రపతి’ చిత్రాన్ని రీమేక్ చేస్తూ హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. నిజానికి అది నార్త్ ఆడియన్స్ కూడా వందల సార్లు యూట్యూబ్ లో చూసేశారు. అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సోనీ మ్యాక్స్ వంటి ఛానల్ లో టెలికాస్ట్ అయినప్పుడు చూసేశారు.
అయినప్పటికీ హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ చిత్రానికి అక్కడ థియేటర్లలో టికెట్లు తెగుతాయా లేదా అన్నది తర్వాతి సంగతి. కానీ (Chatrapathi) ఈ సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెట్టేశారు. పైగా వేస్ట్ ఖర్చులు కూడా చాలానే అయ్యాయి. ముందు ఈ చిత్రంలో నటించడానికి ఏ హీరోయినూ ఒప్పుకోలేదు. నుష్రత్ భరుచ్చా అనే అమ్మాయికి ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం ఇచ్చారు.
నిజానికి ఆ అమ్మాయికి అక్కడ హీరోయిన్ చేసినందుకు రూ.1.5 కోట్ల వరకు పారితోషికం ఇస్తారు. కాబట్టి ఇక్కడ డబుల్ ఇచ్చారన్న మాట. అలాగే కోవిడ్ టైంలో సెట్ కూలిపోయి రూ.3 కోట్లు నష్టం వచ్చింది. ఇక ఈ మధ్యనే ఫిక్స్ చేసిన ‘ఛత్రపతి’ టైటిల్ కు మరో రూ.2 కోట్లు. ఇలా రూ.20 కోట్ల వరకు ఈ చిత్రానికి వేస్ట్ ఖర్చులు అయ్యాయని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ అయితే రూ.80 కోట్లు దాటినట్టు వినికిడి.