ఎంట్రీ కే అంత బడ్జెట్ అవసరమా రాజమౌళి..!

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతుంది. రాజమౌళి.. హీరోలు ఎన్టీఆర్, చరణ్ లను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ కు సంబంధించి రషెష్ చూసిన రాజమౌళి.. సంతృప్తి చెందలేదట. దీంతో మళ్ళీ కొంత ప్యాచ్ వర్క్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఇక 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య. ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ గా… చరణ్ అల్లూరి సీతారామ రాజు గా కనిపిస్తున్న ఈ చిత్రంలో.. దర్శకుడి రాజమౌళి ఫోకస్ అంతా ఎన్టీఆర్ పైనే పెట్టాడని తెలుస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కోసం ఏకంగా 35 కోట్లు పెట్టిస్తున్నాడట. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఓ పోరాట సన్నివేశంతో మొదలవుతుందట. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా.. పలికే డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంటాయట. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ గెటప్ కూడా రెవీల్ చేయకుండా.. కనీసం దానికి సంబందించిన క్లూ కూడా ఇవ్వకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి చరణ్ విషయంలో మాత్రం రాజమౌళి పెద్ద హడావిడి చేయడం లేదట. కానీ కీలక సన్నివేశాలు మాత్రం చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus