Rama Banam: రామబాణం బర్డెన్ అన్ని రూ.కోట్లా.. గోపీచంద్ తో రిస్క్ చేస్తున్నారా?

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ కాంబినేషన్లలో ఒకటి కాగా లక్ష్యం, లౌక్యం తర్వాత ఈ కాంబినేషన్ లో రామబాణం పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడవగా థియేట్రికల్ హక్కులపై 20 కోట్ల రూపాయల భారం ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

గత సినిమాల ఫలితాలను బట్టి గోపీచంద్ ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువు కాదు. అయితే పీపుల్స్ మీడియా బ్యానర్ కు వరుస విజయాలు దక్కుతున్న నేపథ్యంలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో గోపీచంద్ కచ్చితంగా భారీ కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలేవీ ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.

ఓవర్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా (Rama Banam) బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. దర్శకుడు శ్రీవాస్ వల్లే ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో శ్రీవాస్ సైతం సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది. శ్రీవాస్ కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుంది. మే నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.

గోపీచంద్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు గోపీచంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. గోపీచంద్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus