Taapsee: తాప్సి క్రికెటర్ బయోపిక్ లో భారీ మార్పులు

క్రికెటర్ మిథాలీ రాజ్ మహిళల క్రికెట్‌లో ఒక లెజెండ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమెను ఆటలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి వారితో పోల్చుతుంటారు. అయితే మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఒక చిత్రం రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సొట్టబుగ్గల సుందరి తాప్సీ మిథాలి రాజ్ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. కొన్నాళ్ళు తాప్సి క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంది. ఎలాగైనా సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకోవాలని తాప్సి ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తోంది.

ఇక సినిమాకు ‘షాబాష్ మిథు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే మొదట రాహుల్ ధోలాకియా డైరెక్టర్ గా సెలెక్ట్ అవ్వగా ఇప్పుడు అతను తప్పుకోవడంతో మరొకరు వచ్చారు. రాహుల్ స్థానంలో శ్రీజిత్ ముఖర్జీ దర్శకుడిగా సెలెక్ట్ అయినట్లు సమాచారం. దర్శకుడి మార్పుకు కారణం ఇంకా తెలియరాలేదు కాని ‘సబాష్ మిథు’ టీమ్ మాత్రం త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమాలో మిథాలి రాజ్ నిజజీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో పాటు ఆమె సాధించిన విజయాలను చూపించబోతున్నారు.

వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ ఈ మూవీని నిర్మించనుంది. వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు తాప్సి తెలుగులో కూడా ఇటీవల ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus