ఓవర్ సీస్ లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ నాలుగు సినిమాలు
- August 26, 2017 / 03:52 PM ISTByFilmy Focus
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మంచి కేంద్రం అయింది. అక్కడ మన చిత్రాలు మంచి కలక్షన్స్ సాధించాయి. గతంలో బాహుబలి, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది వంటి సినిమాలు బాగా రాబట్టాయి. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలే కాదు చిన్న సినిమాలు సైతం భారీ వసూళ్లు రాబడుతున్నాయి. రీసెంట్ గా వరుణ్ ఎన్నారై గా నటించిన “ఫిదా” మూవీకి అమెరికాలో విశేష ఆదరణ లభించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా అదరగొట్టింది. ఆగస్టు 24 నాటికి ఈ సినిమా 13.14 కోట్లు రాబట్టింది. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన “నేనే రాజు నేనే మంత్రి” కూడా అమెరికాలో బాగా ఆడుతోంది. నిన్నటితో ఈ సినిమా 4 కోట్లు వసూలు చేసింది.
అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఆనందో బ్రహ్మ కూడా ఊహించని కలక్షన్స్ సాధించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆగస్టు 24వ తేదీ వరకు అమెరికాలో 2.25 కోట్లు రాబట్టింది. ఇక నిన్న రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి చిత్రానికి అమెరికాలో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ప్రీమియర్ షోతో కలుపుకొని ఒక్క రోజులోనే 1 .24 కోట్లతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నాలుగు చిత్రాలు జోరు మరికొంతకాలం కొనసాగనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











