ఆశ్చర్యం కలిగిస్తున్న సాహోలోని సీన్స్

రికార్డులను చెరిపివేయడంలో ఉన్న కిక్కే వేరు. కొత్త రికార్డులను సృష్టిస్తుంటే వచ్చే మజానే వేరు. ఆ రెండింటిని ప్రభాస్ బాహుబలి సినిమాలతో ఎంజాయ్ చేశారు. తెలుగు సినిమాకి 1800 కోట్లు సాధించగలిగే సత్తా ఉందని రాజమౌళితో కలిసి నిరూపించారు. ఇప్పుడు సుజీత్ తో కలిసి హాలీవుడ్ యాక్షన్ సినిమాలను సైతం టాలీవుడ్ నిర్మించగలదని చాటి చెప్పేపనిలో ఉన్నారు. అందుకే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సమక్షంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో వేసిన మార్కెట్ సెట్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన ఫొటో ప్రకారం “సాహో”లో 242 సీన్లు కంటే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

సాధారణంగా ఒక సినిమాలో 70 నుంచి 80 సన్నివేశాలు ఉంటాయి. మూడు గంటల నిడివి ఉన్నట్టయితే మరో పది సీన్లు పెరుగుతాయి. కానీ సాహోలో 242 సీన్లు ఉండడం తెలిసి సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. 150 నిముషాల సినిమాలో 242 సీన్లు ఉంటే.. ఒక నిముషంలో రెండు సన్నివేశాలు రన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆడియన్స్ ప్రతి నిముషం థ్రిల్ అవుతారు. అందుకే 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. టీ సిరీస్ తో కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus