ఒక సినిమా క్రేజ్ ను ఆ సినిమా టికెట్ ఎవైలబిలిటీ బట్టి కొలవచ్చు. ఆ లెక్కన “అవెంజర్స్ ఎండ్ గేమ్” క్రేజ్ గురించి చెప్పాలంటే కొత్త పదాలు వెతకాలేమో. విడుదలకు రెండు వారాల ముందు బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎంత పెద్ద సినిమాకైనా మహా అయితే రెండు లేదా మూడు రోజుల వరకు టికెట్స్ బుక్ అవుతాయి. కానీ.. “అవెంజర్స్ ఎండ్ గేమ్” సినిమాకి ప్రీబుకింగ్స్ మొదలుపెట్టిన అరగంటలో ఏకంగా రెండు వారాల టికెట్స్ బుక్ అయ్యాయి. తత్కాల్ టికెట్స్ కంటే వేగంగా జరిగిన ఈ టికెట్ బుకింగ్ చూసి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. రెండు వారాలు.. అంటే 14 రోజుల టికెట్స్ లో బుక్ అయిపోవడం ఏంటి అని మన టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ హల్ చల్ ను ముందే ఊహించినట్లున్నాడు తేజ అందుకే “సీత” సినిమాని మే నెలకి పోస్ట్ పోన్ చేశాడు.
అంతంతమాత్రం ఉన్న “కెప్టెన్ మార్వెల్” సినిమాకే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.. అలాంటిది విపరీతమైన అంచనాలు ఉన్న “అవెంజర్స్ ఎండ్ గేమ్”కి ఏస్థాయిలో కలెక్షన్స్ వస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ రేంజ్ క్రేజ్ మాత్రం ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ బిలియన్ వసూలు చేయడం చాలా సులువైన విషయంలా కనిపిస్తుంది.