Jr NTR : వామ్మో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఇంత క్రేజా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే జపాన్ లో తారక్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తారక్ నటించిన సినిమాలలో ఒకటైన బాద్ షా జపాన్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో పాటు అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. తారక్ జపాన్ కు వెళ్లడంతో ఆయన ఫ్యాన్స్ లో కొందరు చేతితో తయారు చేసిన పోస్టర్లను తారక్ కు గిఫ్ట్ గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేయడం గమనార్హం. మరి కొందరు ఫ్యాన్స్ తారక్ ఫోటోలతో ఉన్న షర్ట్ లను ధరించి తారక్ అవాక్కయ్యేలా చేశారు. జపాన్ లేడీస్ లో కూడా తారక్ కు ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఇతర హీరోల అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరోవైపు ఎన్టీఆర్30 రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. క్రేజ్ ఉన్న నటీనటులను ఈ సినిమాలో ఎంపిక చేయనున్నారని బోగట్టా.

250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus